వెలిగొండ ప్రాజెక్టుపై జగన్ నిరర్హత: మంత్రి గొట్టిపాటి విమర్శ
వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత కూడా వైసీపీ అధినేత జగన్ కు లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ కూడా రాకుండా అడ్డుకున్నది జగనేనని విమర్శించారు. గతంలో చంద్రబాబు సూచనతో ప్రకాశం జిల్లా నేతలమంతా ఢిల్లీకి వెళ్లామని… ప్రాజెక్టు కోసం అప్పటి కేంద్ర మంత్రిని కలిశామని చెప్పారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో జగన్ కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం…