Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeNationalహర్యానా ఎన్నికల్లో వినేశ్ ఫొగాట్ పోటీ: రాజకీయ పార్టీలు ప్రయత్నాలు

హర్యానా ఎన్నికల్లో వినేశ్ ఫొగాట్ పోటీ: రాజకీయ పార్టీలు ప్రయత్నాలు

-

Chat on WhatsApp

ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆమె సన్నిహితులు మంగళవారం జాతీయ మీడియాకు తెలిపారు. తాను క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోనని వినేశ్ ఫొగాట్ ఇదివరకే చెప్పింది. అయితే ఆమెను ఒప్పించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.

పారిస్ ఒలింపిక్స్‌లో కొన్ని కారణాల వల్ల పతకాన్ని కొద్దిలో కోల్పోయిన వినేశ్ ఫొగాట్‌కు ఢిల్లీలో, అలాగే ఆమె స్వస్థలమైన బలాలీ (సోనిపట్‌)లో గత శనివారం ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంగ్రెస్ ఎంపీ దీపేంద్ర హుడా ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

అయితే వినేశ్ ఫొగాట్ ఏ పార్టీలో చేరుతారో తెలియరాలేదని అంటున్నారు. “హర్యానా అసెంబ్లీలో వినేశ్ ఫొగాట్ వర్సెస్ బబితా ఫొగాట్, బజరంగ్ పునియా వర్సెస్ యోగేశ్వర్ దత్‌లను చూసే అవకాశముంది. కొన్ని రాజకీయ పార్టీలు ఆమెను (వినేశ్ ఫొగాట్)ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి” అని ఫొగాట్ కుటుంబం సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ap eapcet 2026 results announced by minister nara lokesh

AP EAPCET 2026 ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే

AP EAPCET Results 2026 Out: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన AP EAPCET 2026 పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...
- Advertisement -
Chat on WhatsApp