
రిజిస్టర్డ్ పోస్ట్ సేవ ముగింపు.. తపాలా శాఖ నిర్ణయం!
భారత తపాలా శాఖ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 50 సంవత్సరాలపాటు ప్రజల జీవితాల్లో భాగమైన రిజిస్టర్డ్ పోస్ట్ సేవను ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుండి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. టీచర్లు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగార్థులు, విద్యార్థులు, గ్రామీణ ప్రాంత ప్రజలు… ఎంతోమంది ఈ సర్వీసుపై ఆధారపడి జీవించారు. తక్కువ ఖర్చుతో అత్యంత విశ్వసనీయంగా సేవలు అందించిన ఈ రిజిస్టర్డ్ పోస్ట్ ఇప్పుడు మనకు గుడ్‌బై చెబుతోంది. అయితే, ఇది…