రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠానికి పతనం
దేశ ప్రజలకు ప్రస్తుతం ధరల పెరుగుదల నుంచి కొంత ఊరట లభించింది. మార్చి నెలలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.34 శాతానికి పడిపోయింది. ఇది 2019 ఆగస్టు తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి. గతేడాది మార్చితో పోలిస్తే ఈ మార్పు గణనీయంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా మారింది. ఆహార ద్రవ్యోల్బణం కూడా తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరిలో 3.75…
