ఇటీవలి కాలంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. సోమవారం నాటి ధరలతో పోలిస్తే పసిడి ధరలు కొంత మేర తగ్గిపోవడంతో కొనుగోలుదారులు ఊపిరిపీల్చుకున్నారు. వెండి ధర కూడా ఇదే బాటలో సాగింది. గత వారం నుంచి పెరుగుతూ వస్తున్న ధరలు ఒక్కసారిగా తగ్గడం గమనార్హం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో మంగళవారం బంగారం ధరలు రూ.350 వరకూ తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,180 గా నమోదైంది. చెన్నైలో కూడా ఇవే ధరలు నమోదయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర తగ్గింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,350 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.95,330 వద్ద ట్రేడైంది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలు ఈ వారం ప్రారంభంలోనే తగ్గడం మార్కెట్‌కి కొత్త సంకేతాలుగా భావిస్తున్నారు నిపుణులు.
అదే సమయంలో వెండి ధరలో కూడా రూ.100 తగ్గుదల కనిపించింది. కిలో వెండి రూ.1,09,800 వద్ద ట్రేడ్ అయింది. బంగారం, వెండి ధరలలోని ఈ ఒడిదుడుకులు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఏర్పడినవని, సమీప భవిష్యత్తులో మరోసారి పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.