బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేసిన వారిపై కఠిన చర్యలు
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయడాన్ని నిరోధించేందుకు కఠిన చర్యలు చేపట్టారు. ఖాళీ స్థలాలు, రహదారుల పక్కన చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే చెత్త ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛతను మెరుగుపరిచేందుకు కమిషనర్ సోమవారం 20వ డివిజన్ పరిధిలోని హనుమాన్ జంక్షన్, స్నేహ నగర్, అక్షయ గార్డెన్, వనంతోపు ప్రాంతాల్లో పర్యటించారు. అపార్ట్మెంట్ల నుంచి ఖాళీ స్థలాల్లో…
