కోవూరు మండలంలోని వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ సెల్ అల్ట్రాసిటీ మెంబర్ సుబ్బరాయుడు మాట్లాడుతూ, వైసీపీ నేత వీరు చలపతిరావుపై అనవసర విమర్శలు చేస్తున్న ఎల్లాయపాలెం ఎంపీటీసీ గరికపాటి రాజా మాటలకు అదుపు పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు అభిమాన నాయకుడైన వీరి చలపతిరావుపై విమర్శలు చేయడం మంచిది కాదని, ఆయన స్థాయిని గమనించాలని సూచించారు.
ఒక రౌడీ షీటర్ అయిన వ్యక్తి మా నేత గురించి మాట్లాడే అర్హత లేదని తీవ్రంగా విమర్శించారు. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెప్తామని స్పష్టం చేశారు. నాయకులపై ఆరోపణలు చేయడం కంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు సేవ చేయడమే రాజకీయ నాయకుల ధ్యేయం కావాలని తెలిపారు.
వైసీపీ నేత మోష మాట్లాడుతూ, రైతుల సమస్యలపై పోరాటం చేస్తే, మా నాయకుడిపై అసత్య ఆరోపణలు చేయడం సబబు కాదని వ్యాఖ్యానించారు. అసభ్య పదజాలంతో మాట్లాడితే తగిన బుద్ధి చెప్పే బాధ్యత తమదేనని హెచ్చరించారు. నాయకుల పట్ల గౌరవభావంతో వ్యవహరించాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎస్సీ విభాగం నాయకులు శ్రీధర్, భాస్కర్, దామెర్ల మధు, జాషువా, కొండూరు వంశీ తదితర వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ మండల నాయకులు పాల్గొన్నారు. తమ నాయకులపై అనవసర ఆరోపణలు మానిపించి, ప్రజా సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.