సంగంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
కర్తవ్య బాటలో భాగంగా విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆత్మకూరు డి.ఎస్.పి వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవమును పురస్కరించుకొని సంగం మండలం లో సీఐ. వేమారెడ్డి, ఎస్ ఐ రాజేష్. ఆధ్వర్యంలో అమరులైన పోలీసులకు స్థానిక పోలీస్ స్టేషన్ సముదాయంలో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థుల సమన్వయంతో పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. సంఘం బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి పోలీసు…
