Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshసీఐ వేమారెడ్డి మనవత్వంతో రహదారి సమస్య పరిష్కారం

సీఐ వేమారెడ్డి మనవత్వంతో రహదారి సమస్య పరిష్కారం

-

Chat on WhatsApp

నెల్లూరు జిల్లా సంగం మండలం కెనరా బ్యాంక్ సమీపం లో రహదారి పై మురుగు నీరు చేరి వాహనదారులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని తెలుసుకున్న సీఐ వేమారెడ్డి సోమవారం తన సొంత పనిగా భావించి రోడ్డుకు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా పలుమార్లు వాహనదారులు ప్రజలు ఈ సమస్యను స్థానిక సీఐ వేమారెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. సీఐ వేమారెడ్డి మానవత్వం తో స్పందించి స్థానికుల సహాయం తో మురుగు నీటి తొలగింపుకు శ్రీకారం చుట్టారు.రహదారి పై దగ్గరుండి జేసిబి సహాయం తో రహదారి పక్కనే కాలువ తీయించి మురుగునీటిని అంతా తొలగించారు. రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రజలు, వాహనదారులు సీఐ. వేమారెడ్డికి సెల్యూట్ కొడుతున్నారు. ఆయనకు ప్రజల నుంచి ప్రశంసలు, దీవెనలు అందుకున్నారు.దీంతో వాహనదారులు ,ప్రయాణికులు సంగం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ అధికారులు అంటే కేవలం అధికారం చెలయించటమే కాకుండా ప్రజలకు సేవ చేసే అధికారులు ఇలాంటి అధికారులు కావాలని, ఇలాంటి అధికారుల వలన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలిపి సీఐ వేమారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp