కుప్పంలో భువనేశ్వరి రథోత్సవంలో పాల్గొన్న సందడి
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుకొని, అక్కడినుండి రోడ్డుమార్గంలో శాంతిపురం మండలం రాళ్లబుదుగురు గ్రామానికి చేరుకున్నారు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి రథాన్ని లాగారు. ఆలయ పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుప్పం నియోజకవర్గానికి చేరుకున్న భువనేశ్వరి కి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు….
