
చీరాలలో “హర్ ఘర్ తిరంగా” ర్యాలీ ఘనంగా నిర్వహణ
బాపట్ల జిల్లా చీరాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా “హర్ ఘర్ తిరంగా” ర్యాలీని ఘనంగా నిర్వహించారు. చీరాల మునిసిపల్ కార్యాలయం నుండి గడియారస్థంభం సెంటర్ వరకు యువనాయకుడు ఎం. మహేంద్రనాధ్ బాబు ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మహేంద్రనాధ్ బాబు మాట్లాడుతూ, “మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యమని” పిలుపునిచ్చారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ మించాల…