అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. IMA హాల్ నుంచి ముక్కోణపు పార్కు వరకు విద్యార్థులు, డాక్టర్లు, ప్రజాప్రతినిధులు కలసి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మహిళా సాధికారతకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరై, సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రైడ్ స్కూల్ విద్యార్థులు మహిళా గొప్పతనాన్ని నృత్య ప్రదర్శన రూపంలో చక్కగా అందించినట్లు తెలిపారు. ఇటీవల రాజస్థాన్‌లో నిర్వహించిన పోటీల్లో ప్రైడ్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీ గెలుచుకున్నందుకు అభినందనలు తెలియజేశారు.
మహిళలు అన్ని రంగాల్లో ముందుండి సమాజాన్ని నడిపిస్తున్నారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మహిళలు లేకుంటే మానవ మనుగడ ఉండదని, మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రైడ్ స్కూల్ ప్రిన్సిపాల్ అశోక్ కుమార్, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ భవానీ ప్రసాద్, బీసీ సెల్ అధ్యక్షుడు కౌతరపు జనార్ధన్, పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు, ఎంఆర్ఎఫ్ రమేష్, తేలబ్రోలు నాగేశ్వరరావు, దోగుపర్తి బాలకృష్ణ, మాధవరావుతో పాటు టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.