
రహదారి భద్రతపై గంగవరం లో ఆర్టీవో అవగాహన కార్యక్రమం
ఆర్టీవో సురేష్ కుమార్ ఆధ్వర్యంలో గంగవరం హనుమాన్ కూడలి వద్ద రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. ఆటో యూనియన్, ద్విచక్ర వాహనదారులతో కలిసి భద్రతా నియమాలను అమలు చేయాలనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆటోల్లో నలుగురు ప్రయాణికులకంటే ఎక్కువ మంది ప్రయాణించరాదని స్పష్టం చేశారు. అధిక ప్రయాణికులను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, వాటి ఉల్లంఘన వల్ల ప్రమాదాలు జరుగుతాయని…