A three-day ‘Poshan Bhi - Padai Bhi’ training program is being conducted for Anganwadi workers at Gangavaram ICDS office.

గంగవరం అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజుల శిక్షణ

అల్లూరి జిల్లా, రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సిహెచ్ లక్ష్మి తెలిపారు. ఈ శిక్షణ “పోషణ్ భీ – పడాయి భీ” ప్రోగ్రామ్‌ కింద జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్ల ద్వారా అందించబడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు పౌష్టికాహారం, పిల్లల ఆరోగ్య సంరక్షణ, మరియు ప్రాథమిక విద్య మెరుగుదలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. చిన్నారుల పెరుగుదల,…

Read More
An unidentified body was found near Paidiputta Canal in Addatigala Mandal, Alluri District. Police have launched an investigation.

అడ్డతీగల మండలంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని అడ్డతీగల మండలం పైడి పుట్ట కాలువ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఉదయం అక్కడికి వెళ్లిన గ్రామస్తులు మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం ఎంతకాలంగా అక్కడ ఉందో స్పష్టత రాలేదు. ప్రాథమికంగా దుస్తుల ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలను తెలుసుకునేందుకు సమీప గ్రామాల్లో అదృశ్యమైన…

Read More
A grand farewell ceremony was held for 10th-class students at Gangavaram Ashram Girls' School, with dignitaries blessing the students.

గంగవరం ఆశ్రమ బాలికల పాఠశాలలో పదవ తరగతి వీడ్కోలు

గంగవరం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో విద్యార్థినులు ఆనందంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి జడ్పిటిసి బేబీ రత్నం, వైస్ ఎంపీపీ కుంజమ్ గంగాదేవి, ఎంఈఓ మల్లేశ్వరరావు, సర్పంచ్ కలుముల అక్కమ్మ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అతిథులు విద్యార్థులకు ఉపదేశాలు అందిస్తూ, వారి భవిష్యత్తు కోసం కృషి చేయాలని సూచించారు. మంచి ర్యాంకులు సాధించి, తమ…

Read More
Alluri district tribals joyfully celebrate Pappula Panduga with traditional rituals, folk dances, and festive offerings.

గిరిజనుల ఆనందోత్సవం పప్పుల పండుగ సంబరాలు

అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం రాజంపాలెం గ్రామంలో గిరిజనులు సంప్రదాయంగా పప్పుల పండుగను జరుపుకున్నారు. పొలాల్లో పండించిన కందిపప్పులను ఇంటికి తెచ్చిన తర్వాత ఈ పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గిరిజన మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గ్రామంలోని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కలిసి ఉత్సాహంగా పాల్గొంటారు. మహిళలు, చిన్నపిల్లలు గిరిజన వేషధారణలో పాల్గొని ఊరేగింపులు నిర్వహిస్తారు. గిరిజన వృత్యాలతో పాటలు పాడుతూ, మేకపోతును ఊరేగిస్తూ…

Read More
Collector Dinesh Kumar visited submerged areas in Devipatnam, heard grievances of displaced families, and directed officials for immediate action.

పోలవరం ముంపు గ్రామాలను పర్యటించిన కలెక్టర్ దినేష్ కుమార్

పోలవరం ప్రాజెక్ట్ ముంపుకు గురైన దేవీపట్నం మండలంలోని కొండమొదల ఆర్ అండ్ ఆర్ కాలనీలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. ముంపు బాధితుల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితిని సమీక్షించారు. స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులు తమ సమస్యలను వివరించేందుకు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణం, భూమికి భూమి మార్పిడి, సౌకర్యాల లోపం వంటి సమస్యలపై గళమెత్తారు. కాలనీల్లో తాగునీటి సమస్య, విద్యుత్ సమస్యలు కూడా ఉన్నాయని వారు…

Read More
Harsh Kumar pledged to provide employment opportunities for tribal youth and urged to support GV Sundar's victory in the MLC elections.

గిరిజన నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాం

మాజీ ఎంపీ హర్ష కుమార్ మాట్లాడుతూ, గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తన కృషిని కొనసాగిస్తానని తెలిపారు. అల్లూరి జిల్లా, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవి సుందర్ ను గెలిపించాలని ఆయన కోరారు. రంపచోడవరం ఆర్క రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో హర్ష కుమార్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో పలు సమస్యలు ఉన్నాయని, అందులో ఆరోగ్యం, విద్య, త్రాగునీరు వంటి అంశాలు ముఖ్యమైనవి అన్నారు. ఈ సమస్యల పరిష్కారం…

Read More
TDP leaders affirmed strict implementation of the 1/70 Act to protect tribal rights. They urged people not to fall for YSRCP’s tactics.

1/70 చట్టం అమలుపై టిడిపి నేతల స్పష్టమైన హామీ

అల్లూరి జిల్లా కేంద్రంలోని కిడారి క్యాంప్ కార్యాలయంలో టిడిపి నేతలు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచులు బాకూరు వెంకటరమణ రాజు, పాంగి పాండురంగ స్వామి, తామర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణకు 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని వారు స్పష్టం చేశారు. డివిజన్ నాయకుడు, దారేల సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఆదివాసీలను మోసపుచ్చేందుకు ప్రలోభాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలు వాటికి లొంగకుండా తమ హక్కులను…

Read More