అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని అడ్డతీగల మండలం పైడి పుట్ట కాలువ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఉదయం అక్కడికి వెళ్లిన గ్రామస్తులు మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం ఎంతకాలంగా అక్కడ ఉందో స్పష్టత రాలేదు. ప్రాథమికంగా దుస్తుల ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలను తెలుసుకునేందుకు సమీప గ్రామాల్లో అదృశ్యమైన వ్యక్తుల సమాచారం కోసం విచారణ చేస్తున్నారు. అదనపు ఆధారాలు కోసం కాలువ పరిసరాలను పరిశీలిస్తున్నారు.
ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయాడా? లేక ఇది హత్యా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.