జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల కేంద్రం శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాలలో నేడు ఉదయ దినోత్సవం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటామన్నారు.
ప్రపంచ హృదయ దినోత్సవం అంటే హృదయాన్ని రక్షించుకునే అంశంపై అవగాహన కల్పించడం కోసం జరుపుకోవాలని ఆయన తెలిపారు.
గుండె ఆరోగ్యానికి మంచి జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ దినోత్సవ ఉద్దేశం అని ఆయన స్పష్టం చేశారు.
అందుకే, హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమని, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని సూచించారు.
మీ హృదయాన్ని ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచడానికి సరైన ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడికి దూరంగా వుండటం చాలా అవసరమని చెప్పారు.
హృదయ పరీక్షలను నిర్వహించడం, ఆరోగ్యంగా హృదయాన్ని ఉంచుకోవాలని విద్యార్థులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్, డైరెక్టర్, కరస్పాండెంట్, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.