హైదరాబాద్ బేగంపేట్ టూరిజం ప్లాజా హోటల్లో ఆదివారం అఖిలభారత గౌడ సంఘం సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీపతి నాయక్, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మరియు బిసి మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బిసి సంఘ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మరియు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల గౌడ సంఘ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో అఖిలభారత గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ మాట్లాడుతూ, గౌడ సంఘం తనంతా ఒక యూనిటీగా ఉండి, తమ హక్కుల కోసం అతి త్వరలో ఢిల్లీలో గౌడ గర్జన నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
పల్లె లక్ష్మణరావు గౌడ్ వేరే ప్రాంతాల్లోని గౌడ సంఘాలను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ లో జరిగే గౌడ గర్జనలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన నిర్ధారణ చేశారు.
ఈ సమావేశంలో గౌడ సంఘం అభివృద్ధి కోసం చేయాల్సిన పనులను, ప్రభుత్వాలకు ఇచ్చే సూచనలను కూడా చర్చించడంతో, ఈ అంశాలు ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.