శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో విద్యార్థినులతో పెద్దఏతున్న ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ద్వారా పెండింగ్‌లో ఉన్న మెస్ చార్జీలను విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ (APSF) సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మొత్తం 2733 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలు ఉన్నాయి, ఇవి 3,13,695 మంది విద్యార్థులను అందిస్తున్నాయి. విద్యా సంవత్సరముఆరంభమై ఆరు నెలలు పూర్తయ్యినా, విద్యార్థులకు ప్రభుత్వంతో రావాల్సిన మెస్ చార్జీలు ఇంకా విడుదల కాలేదు. ప్రభుత్వ ఫండ్స్ నుండి రావాల్సిన చార్జీలను విడుదల చేయకపోవడంతో హాస్టల్ వార్డెన్లు అప్పులు చేసి నిర్వహణ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం నిత్యవసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో, హాస్టల్స్ నిర్వహణకు విభాగం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, హాస్టల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి బసవుపరమైన సౌకర్యాలు, మూడు జతల యూనిఫామ్, బెడ్ సీట్లు, ప్లేట్లు, బకెట్లో మగ్గులు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, గత విద్యా సంవత్సరం మూడు నెలలుగా కొన్ని హాస్టల్స్‌కు బిల్లులు విడుదల కాలేదు.
ఈ కార్యక్రమంలో APSF నియోజకవర్గ నాయకులు సుకృత్, పట్టణ అధ్యక్షకార్యదర్శి దినేష్, స్వామి, కార్తీక్, పవన్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. APSF వారు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.