పరకాల నియోజక వర్గ పరిధి బల్దియా 15వ డివిజన్ మొగిలిచర్ల రైతు వేదిక భవనంలో జిడబ్ల్యూ ఎంసీ పరిధిలోని 15, 16, 17 డివిజన్లలోగల అభివృద్ధి పనుల పురోగతి, సమస్యల పరిష్కారంపై శనివారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం లో స్థానిక శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి పాల్గొన్న నగర మేయర్ గుండు సుధారాణి హాజరైన కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే. ఈ సందర్భం గా డివిజన్ పరిధి లోని శానిటేషన్, నీటి సరఫరా, వివిధ ప్రభుత్వ పథకాల కింద కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వైద్య సేవలు, గుడుంబా, గంజాయి నిర్మూలన, తదితర సమస్యల పురోగతి గురించి మేయర్ ఎమ్మెల్యే సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించుటకు దిశా నిర్దేశం చేశారు.
ఇట్టి కార్యక్రమంలో ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, సీఎం హెచ్ వో డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జి సిపి రవీందర్ రాడేకర్, హెచ్ ఓ రమేష్, బయాలజిస్ట్ మాధవ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ కృష్ణా రెడ్డి, ఎం హెచ్ ఓ డా రాజేష్, తహసీల్దార్ రియాజ్ ఈ ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.