రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో చెత్త కుప్పలో ఓ పురాతన వీర మల్లు విగ్రహాన్ని పడేశారని గ్రామస్తులు తెలిపారు.గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పరిసరాల్లో ఉన్న పురాతన విగ్రహాన్ని తొలగించి రోడ్డు పక్కన ఉన్న చెత్త కుప్పలో పడవేశాడని పేర్కొన్నారు.ఈ విగ్రహాన్ని రోడ్డు పక్కన చేత్తలో చూసిన గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు పిర్యాదు చేసిన్నట్లు తెలిపారు.వీర మల్లు విగ్రహాన్ని చెత్త కుప్పలో పడేసిన వారే గ్రామంలో తిరిగి విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
రాయిలాపూర్‌లో చెత్తకుప్పలో పడేసిన పురాతన విగ్రహం
