మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తండా గ్రామంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి గిరిజన మహిళలు నీటిని తీసుకొని డబ్బు చప్పుళ్ళు, భక్తి గీతాలు భజన కీర్తనలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాతకు అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో బోగ్ బాండర్ హోమం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రతి సంవత్సరం గిరిజన తండాలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ పూజారి రాజు మహారాజ్ తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాట్రియాల తండాలో ఘనంగా నిర్వహించిన దసరా ఉత్సవాలు
