క్రీడలు మానసి కొల్లాసానికి శరీర దారుణ్యానికి, స్నేహ సౌబ్రాతృత్వం పెంపొందించుకోవడం కోసం ఎంతో ఉపయోగపడతాయని చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ అన్నారు, చిన్న శంకరంపేట మండలం కామారం తండాలో పాపయ్య గారి సంగారెడ్డి స్మారక క్రికెట్ పోటీలను వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు ఈ క్రికెట్ పోటీలను ఎస్ఐ నారాయణ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి ప్రారంభించారు అనంతరం ఎస్సై నారాయణ గౌడ్, పాపయ్య గారి రామ్ రెడ్డి లు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లా సనికి ఎంతో ఉపయోగపడతాయని క్రీడల్లో గెలుపు ఓటమి సహజమని, క్రీడలతో స్నేహ సంబంధాలు పెరుగుతాయని సోదర భావంతో క్రీడలలో పాల్గొనాలని ఎలాంటి గొడవలకు తావివ్వకుండా జరుపుకోవాలని మొత్తం 25 టీంలు పాల్గొనడం జరుగుతుందని పోటీలలో పాల్గొన్న ప్రతి జట్టుకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ క్రీడ పోటీలు ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాపయ్య గారి రామిరెడ్డి, పాపయ్య గారి రాజిరెడ్డి,నరేష్ నాయక్, నరేందర్ నాయక్, స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
చిన్న శంకరంపేటలో క్రికెట్ పోటీలు
