కోవూరు మండల కేంద్రంలోని తాలూకా ఆఫీస్ ఎదురు శాంతినగర్ సందులో భారీ చోరీ జరిగినట్లు సమాచారం వచ్చింది.
ఉప్పలపాటి నాగిరెడ్డి వారి కుటుంబ సభ్యులు గత రాత్రి రేబాల్లోని కుమార్తె ఇంటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది.
ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగలగొట్టి వారి ఇంటిలోకి ప్రవేశించారు.
వారి ఇంటి నుంచి సుమారు 25 సార్లు బంగారు 2 కేజీలు మరియు వెండి అపహరించారు.
ఈ విషయం తెలుసుకున్న నాగిరెడ్డి కుటుంబ సభ్యులు కోవూరు పోలీసులను ఆశ్రయించారు.
కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ రంగనాథ్ గౌడ్, నెల్లూరు రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
పోలీసుల బృందం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, చోరీకి సంబంధించిన అన్ని వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.