కడప జిల్లా ప్రొద్దుటూరులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల సందర్భంగా, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు.
ప్రొద్దుటూరు ఇండస్ట్రియల్ స్టేట్‌లోని శ్రీరామ ఆయిల్ పరిశ్రమకు అవసరమైన ఫుడ్ లైసెన్స్ లేకపోవడం, నిబంధనల ప్రకారం ఉండాల్సిన ముద్రలు లేని విషయాలు గుర్తించబడ్డాయి.
ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత ఆధ్వర్యంలో అనుమతుల లేకపోవడంతో నోటీసులు ఇవ్వడం, మరియు పామాయిల్ ఇతర ఆయిల్స్‌కి సంబంధించి శాంపిల్స్ సేకరించడం జరిగిందని తెలిపారు.
కల్తీ ఉన్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రశాంతంగా ఉండే పండుగ సీజన్లలో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని, ఎక్కువ స్టాక్‌ను నిల్వ చేసుకున్న వారిపై కూడా తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. సఫా ఆయిల్ ప్యాకెట్లు తయారీకి సంబంధించిన కేసులు కూడా నమోదు చేసినట్లు వివరించారు.