చింతూరు ఏజెన్సీలో రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నది ఉప్పొంగి ప్రవహించడంతో భారీగా వరద నీరు డొంకరాయ్ జలాశయాలు చేరింది.

దీంతో అధికారులు అప్రమత్తమై 7 గేట్లను ఓపెన్ చేసి 1 లక్ష,11 వేలు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
సీలేరు నది ఉదృతంగా ప్రవహించడంతో శబరి నదికి వరద నీరు పోటెత్తుతుంది దీంతో చింతూరు ఏజెన్సీలోని ముంపు మండలాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
చింతూరు మోతుగూడెం ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహనాలకు ఇబ్బంది తలెత్తుతుంది.