Lava Yuva Star 3 : భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లావా (Lava) మరో బడ్జెట్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ‘యువ’ సిరీస్‌లో భాగంగా “Lava Yuva Star 3” పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. గతంలో వచ్చిన Yuva Star 2కి ఇది సక్సెసర్‌గా అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలో మెరుగైన డిస్ప్లే, బ్యాటరీ బ్యాక్అప్, లేటెస్ట్ సాఫ్ట్వేర్ కోరుకునే వినియోగదారులే లక్ష్యంగా ఈ ఫోన్‌ను రూపొందించారు.
Lava Yuva Star 3లో “6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లే” ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఇది వీడియో స్ట్రీమింగ్, సాధారణ గేమింగ్‌కు స్మూత్ అనుభూతిని ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో “Unisoc SC9863A ఆక్టా-కోర్ ప్రాసెసర్ (1.6GHz)” ఉపయోగించారు.
మెమరీ విషయానికొస్తే, ఫోన్లో “4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్” ఉన్నాయి. వర్చువల్ RAM ఫీచర్ ద్వారా మొత్తం 8GB వరకు వినియోగించుకోవచ్చు. మైక్రో SD కార్డ్ సపోర్ట్‌తో స్టోరేజ్‌ను 512GB వరకు పెంచుకునే అవకాశం ఉంది.
సాఫ్ట్వేర్ పరంగా ఇది “Android 15 Go Edition”పై రన్ అవుతుంది. కెమెరా సెటప్‌లో వెనుక భాగంలో “13MP AI కెమెరా”, ముందు భాగంలో “5MP సెల్ఫీ కెమెరా” అందించారు.
ALSO READ:GHMC Three Municipal Corporations | హైదరాబాద్ మూడు కార్పొరేషన్లు – మీ ఏరియా ఎక్కడ ఉందో తెలుసా?

Lava Yuva Star 3 launched in India at ₹7,499 with HD+ 90Hz display, Android 15 Go Edition, 5000mAh battery, IP64 rating and 13MP AI camera.
ఫోన్‌కు శక్తినిచ్చేలా “5000mAh బ్యాటరీ” ఉంది. ఇది 10W USB Type-C ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అదనంగా IP64 రేటింగ్, సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, FM రేడియో వంటి ఫీచర్లు ఉన్నాయి.
“ధర విషయానికొస్తే”, Lava Yuva Star 3 (4GB+64GB) వేరియంట్ ధర “రూ.7,499”. ఇండస్ బ్లాక్, సియాచిన్ వైట్ రంగుల్లో లభించనుంది. లావా అందించే ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ సదుపాయం కూడా వినియోగదారులకు లభిస్తుంది.
