Jr NTR Dragon | డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప అనారోగ్యం

jr ntr dragon movie shooting update jr ntr dragon movie shooting update

Dragon Shooting Update: జూనియర్ ఎన్టీఆర్(Jr.Ntr) హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’(Dragon)పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలల విరామం తర్వాత ఇటీవలే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించిన చిత్రబృందం, హైదరాబాద్‌లో నైట్ షెడ్యూల్‌లో వేగంగా చిత్రీకరణ కొనసాగిస్తోంది.

ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ టోవినో థామస్, సీనియర్ నటుడు బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అలాగే బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో చేపట్టింది.

ఇదిలా ఉండగా, తాజాగా షూటింగ్‌కు స్వల్ప విరామం పడింది. జూనియర్ ఎన్టీఆర్ గత కొన్ని రోజులుగా స్వల్ప జలుబుతో బాధపడుతున్నారని సమాచారం.

also read:Elon Musk Ryanair Poll | ర్యాన్ఎయిర్ కొనుగోలుపై ఎలాన్ మస్క్ పోల్….నెట్టింట హాట్ టాపిక్

ఆరోగ్య సమస్య పెద్దది కాకపోయినా, పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో యూనిట్ తాత్కాలికంగా షూటింగ్‌ను నిలిపివేసింది.

ఇప్పటికే కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఈ సినిమా షూటింగ్‌కు మరోసారి బ్రేక్ వచ్చినప్పటికీ, ఇది కేవలం ఒకటి లేదా రెండు రోజులకు మాత్రమేనని చిత్రబృందం స్పష్టం చేసింది. త్వరలోనే షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతుందని తెలిపింది.

ప్రశాంత్ నీల్ ఈ సినిమాను హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. మొదట 2026 జనవరి 26న విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కారణంగా సినిమాను 2027కి వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *