Elon Musk Ryanair Poll | ర్యాన్ఎయిర్ కొనుగోలుపై ఎలాన్ మస్క్ పోల్….నెట్టింట హాట్ టాపిక్

elon musk ryanair takeover poll on x platform elon musk ryanair takeover poll on x platform

Elon Musk Ryanair Poll: టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన సోషల్ మీడియా యాక్టివిటీతో చర్చలకు కేంద్రబిందువయ్యారు. యూరప్‌లో ప్రముఖ లో-కాస్ట్ ఎయిర్‌లైన్ అయిన ర్యాన్ఎయిర్‌(Ryanair)ను కొనుగోలు చేయాలా? అనే ప్రశ్నతో మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోల్ నిర్వహించారు.

ఈ పోల్ కేవలం సరదా కోసం వేసిందా? లేక వ్యాపార వ్యూహంలో భాగమా? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి.

ఇటీవల ర్యాన్ఎయిర్ సీఈఓ మైఖేల్ ఓ’లియరీతో మస్క్ మధ్య ఘాటు వాగ్వాదం చోటుచేసుకుంది. ర్యాన్ఎయిర్ విమానాల్లో స్టార్‌లింక్ ఇన్‌ఫ్లైట్ వైఫై సేవలు అందించాలన్న ప్రతిపాదనను ఖర్చుల కారణంగా ర్యాన్ఎయిర్ తిరస్కరించడంతో ఈ వివాదం మొదలైంది. అనంతరం ఓ ఇంటర్వ్యూలో ఓ’లియరీ, మస్క్‌ను తీవ్రంగా విమర్శిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేశారు.

ALSO READ:Inter Exams 2026 | ఇంటర్  విద్యార్థులకు గుడ్ న్యూస్…ఆలస్యమైనా పరీక్ష రాయొచ్చు


దీనికి ప్రతిస్పందించిన మస్క్ కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలోనే ర్యాన్ఎయిర్ కొనుగోలుపై పోల్ నిర్వహించడం మరింత ఆసక్తిని రేపింది.

కొద్ది గంటల్లోనే ఈ పోల్‌కు 7.5 లక్షలకు పైగా ఓట్లు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 76.8 శాతం మంది కొనుగోలుకు అనుకూలంగా ఓటు వేశారు.

అయితే, ఈ పోల్ నిజంగా టేకోవర్ దిశగా వేసిన అడుగేనా? లేక మస్క్ శైలిలో చేసిన సరదా వ్యాఖ్యేనా? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *