జమ్మూ కాశ్మీర్లో హై అలెర్ట్…..సీసీటీవీ కెమెరాలో  చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాది

lashkar-e-taiba terrorist seen in cctv footage in anantnag kashmir lashkar-e-taiba terrorist seen in cctv footage in anantnag kashmir

Jammu Kashmir High Alert: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. స్థానిక మార్కెట్ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరా(cc camera)లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(lashkar-e-taiba)కు సంబంధించిన ఉగ్రవాదులు కనిపించడంతో భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు ప్రారంభించాయి. డిసెంబర్ 25న సాయంత్రం 6:12 గంటల సమయంలో ఈ ఫుటేజ్ రికార్డయినట్లు అధికారులు వెల్లడించారు.

సీసీటీవీ వీడియోలో కనిపించిన వ్యక్తుల్లో ఒకరిని కుల్గాం జిల్లా ఖేర్వాన్‌కు చెందిన మహ్మద్ లతీఫ్ భట్‌గా గుర్తించారు. మరో వ్యక్తి హంజుల్లా అనే పాకిస్తానీ కమాండర్ అయి ఉండొచ్చని భద్రతా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ALSO READ:GHMC | 300 వార్డులతో దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌గా గ్రేటర్ హైదరాబాద్

మహ్మద్ లతీఫ్ భట్ ఈ ఏడాది నవంబర్‌లో లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ అయిన కాశ్మీర్ రివల్యూషన్ ఆర్మీ (KRA)లో చేరినట్లు సమాచారం.

ఈ వీడియో వెలుగులోకి రావడంతో డెంగర్ పోరా, ఖాజీబాగ్ ప్రాంతాల్లో సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదుల కదలికలపై స్పష్టత పొందేందుకు స్థానికులను విచారిస్తూ, నిఘా సమాచారాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *