Cough Syrup: ఉత్తర్‌ప్రదేశ్‌లో కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ అక్రమ రవాణా, నిల్వ మరియు విక్రయాల కేసులో దర్యాప్తు వేగవంతం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హై-లెవల్ SIT నివేదిక తర్వాత, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం ఉదయం నుంచి వరుస దాడులు నిర్వహించింది.
ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో మొత్తం 25 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్ పరారీలో ఉండగా, అతను దుబాయ్‌లో తలదాచుకున్నాడు అనే అనుమానం వ్యక్తమవుతోంది.
ALSO READ:U19 Asia Cup | మరోసారి రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ…14 సిక్సులతో
అతని సహచరులు అలోక్ సింగ్, అమిత్ సింగ్, అలాగే కాఫ్ సిరప్ తయారీదారులు, CA విష్ణు అగర్వాల్ కూడా కనిపించకుండా ఉన్నారు. వీరు అక్రమంగా కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ సరఫరా చేసి వ్యాపారం జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన సోదాల్లో ఈడీ లక్నో, వారణాసి, జౌన్‌పూర్, సాహరన్‌పూర్, రాంఛీ, అహ్మదాబాద్ వంటి ప్రాంతాలను తనిఖీ చేసింది.
ఇప్పటివరకు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఈ కేసులో శుభం జైస్వాల్ తండ్రి భోళా ప్రసాద్ సహా 32 మందిని అరెస్ట్ చేశారు. గత రెండు నెలల్లో వివిధ జిల్లాల్లో 30కు పైగా FIRలు నమోదైన నేపథ్యంలో ఈడీ ECIR ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసింది.
