శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు,మండల–మకర విలక్కు పూజల నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం, మంగళవారం రోజుల్లోనే రెండు లక్షల మందికి పైగా భక్తులు సన్నిధానాన్ని చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం, పంబ నుండి సన్నిధానం మార్గం వరకు తీవ్రమైన రద్దీ నెలకొంది.
భారీ జనసందోహం కారణంగా భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది.
వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ ద్వారా రోజుకు 90 వేల మందికి మాత్రమే దర్శనం అనుమతించాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, రోజుకు లక్షకు పైగా భక్తులు రావడంతో ఏర్పాట్లు విఫలమయ్యాయి. 10 నుంచి 15 గంటలపాటు క్యూలో నిలబడిన భక్తులకు త్రాగునీరు, ఆహారం వంటి కనీస సౌకర్యాలు అందక చిన్నారులు, వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు.
ALSO READ:Ap Telangana Weather Update | ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
18 మెట్ల వద్ద రద్దీ తగ్గకపోవడంతో క్యూలైన్లు కిలోమీటర్ల మేర సాగాయి. రద్దీ నియంత్రణకు అవసరమైన పోలీసు సిబ్బంది తగినంతగా లేకపోవడం, కేంద్ర బలగాలు అందుబాటులో లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది.
ఏర్పాట్లు సరిపోలేదని టిడీబీ అధ్యక్షుడు జయకుమార్ కూడా అంగీకరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే గతేడాది వంటి సంక్షోభం మళ్లీ పునరావృతం అవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
