సిట్:నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో భాగంగా ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ విచారణలో విజయ్ దేవరకొండ చేసిన ప్రమోషన్లు, వాటికి సంబంధించి తీసుకున్న పారితోషికం, కమీషన్లు, ఆర్థిక లావాదేవీల వివరాలపై సిట్ అధికారులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
సమాచారం ప్రకారం, సిట్ అధికారులు ఈ విచారణలో ఆ యాప్‌లతో ఉన్న ఒప్పంద పత్రాలు, ప్రమోషన్ చేసిన సమయం, చెల్లింపులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశాలపై కూడా ప్రశ్నిస్తున్నారు.
ALSO READ: ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మూడు కేసులు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు
ఈ కేసులో విజయ్ దేవరకొండతో పాటు నటుడు ప్రకాశ్ రాజ్‌కు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వారి జాబితాలో పలువురు సినీ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో పూర్తి వివరాలు వెలుగులోకి తెచ్చేందుకు సిట్ అధికారులు దశలవారీగా విచారణ కొనసాగిస్తున్నారు.
విజయ్ దేవరకొండ ఇచ్చిన వివరణల ఆధారంగా అవసరమైతే మరిన్ని ప్రముఖులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
