టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హఠాత్తుగా కనిపించకపోవడంతో క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జడేజాను టీమ్ నుంచి రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తుండగా, ఈ పరిణామం ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
2026 ఐపీఎల్ సీజన్ కోసం సీఎస్కే జడేజా స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్‌సన్‌ను తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని సమాచారం.
ALSO READ: కొచ్చిలో షాక్! కూలిపోయిన KWA వాటర్ ట్యాంక్ – 1.38 కోట్ల లీటర్ల నీరు జనావాసాలపైకి!
ఇక సంజు కూడా టీమ్ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, సోమవారం జడేజా ఇన్‌స్టా అకౌంట్ కనిపించకపోవడం అభిమానుల్లో ఆందోళన రేపింది. అయితే అది టెక్నికల్ కారణమా, లేక వ్యక్తిగత నిర్ణయమా అనేది స్పష్టత రాలేదు.
గత కొన్ని సీజన్లుగా (CSK)తో కొనసాగుతున్న జడేజా, 2022లో కొంతకాలం పాటు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మళ్లీ ఎంఎస్ ధోనీ పగ్గాలు చేపట్టాడు.
ప్రస్తుతం జడేజా భవిష్యత్ గురించి సీఎస్కే నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, సోషల్ మీడియాలో ఆయన ఇన్‌స్టా గైబై మిస్టరీగా మారింది.
