కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో తమ్మనం ప్రాంతంలో కేరళ వాటర్ అథారిటీ (KWA)కి చెందిన ఫీడర్ ట్యాంక్ సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు “1.38 కోట్ల లీటర్ల నీరు”ఒక్కసారిగా జనావాసాలపై విరుచుకుపడింది.
దీంతో అనేక ఇళ్లు నీటమునిగి, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొన్ని ఇళ్ల పైభాగాలు కూలిపోగా, వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి.
ALSO READ:దేశంలో మరో పెద్ద ఉగ్ర కుట్ర భగ్నం – ఫరీదాబాద్‌లో భారీగా RDX స్వాధీనం
రాత్రి “2 గంటల సమయంలో ట్యాంక్‌లో భాగం కూలిపోవడంతో” సమీప ప్రాంతమంతా నీటిలో మునిగిపోయింది. అనేక ఇళ్లలో ఎలక్ట్రిక్ పరికరాలు, ఫర్నిచర్ నాశనం కాగా, సమీపంలోని ఆరోగ్య కేంద్రంలోకి నీరు చేరి మందులు, వైద్య పరికరాలు పాడయ్యాయి.
ఈ ట్యాంక్‌ను సుమారు “50 ఏళ్ల క్రితం నిర్మించారు”. ఇక్కడినుంచి కొచ్చి, త్రిపునితుర ప్రాంతాలకు నీరు సరఫరా అవుతుందని ఎమ్మెల్యే వినోద్ తెలిపారు.
స్థానికులు ట్యాంక్ భద్రతపై అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు కలిగిన నష్టాన్ని అంచనా వేసి “తక్షణ నష్టపరిహారం చెల్లించాలంటూ”ఎమ్మెల్యే కేడబ్ల్యూఏ అధికారులను కోరారు.
ప్రస్తుతం కొచ్చి మరియు పరిసర ప్రాంతాలకు “ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లు” చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
