ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ఎంతో గొప్ప నాయకుడని, తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని ట్రంప్ పేర్కొన్నారు.
వచ్చే ఏడాది భారత్ పర్యటనకు వస్తానని వెల్లడించారు. భారత్‌తో వాణిజ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని, త్వరలోనే ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరవచ్చని తెలిపారు. భారతదేశం రష్యా నుండి కొనుగోళ్లు దాదాపుగా ఆపివేసిందని ట్రంప్ వెల్లడించారు.
వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా తన పర్యటన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ALSO READ:ప్రపంచకప్ విజేత క్రికెటర్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్‌లో ఘన స్వాగతం
ఇదిలావుంటే, ది న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, అమెరికా విధించిన అధిక సుంకాల నిర్ణయం నేపథ్యంలో క్వాడ్ సమ్మిట్ కోసం ట్రంప్ పర్యటనను వాయిదా వేసినట్లు తెలిసింది.
అదే సమయంలో వైట్‌హౌస్ ప్రెస్ మీటింగ్‌లో బరువు తగ్గించే ఔషధాల ధర తగ్గింపు కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ వ్యాఖ్యలు విశేషంగా మారాయి.
ఈ వ్యాఖ్యలు రష్యాపై ఆంక్షలు, ఇంధన పరిమితుల ద్వారా ఆర్థిక ఒత్తిడి తెచ్చే అమెరికా వ్యూహానికి అనుగుణంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మాత్రం దేశ ఇంధన విధానం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.
