మోదీ మరోసారి ఆంధ్ర ప్రజలకు ద్రోహం – AISF

AISF State Secretary Bandela Naser slammed PM Modi’s visit, accusing him of ignoring key promises to Andhra Pradesh and betraying its people again. AISF State Secretary Bandela Naser slammed PM Modi’s visit, accusing him of ignoring key promises to Andhra Pradesh and betraying its people again.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రాష్ట్రానికి వచ్చినా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని, మళ్లీ మోసపూరిత ప్రయాణమేనని AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ తీవ్రంగా విమర్శించారు. తెనాలిలో మీడియాతో మాట్లాడిన ఆయన, మోదీ ప్రభుత్వం మళ్లీ ఆంధ్ర ప్రజల నమ్మకాన్ని వంచించిందని తెలిపారు.

వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాల్సి ఉన్నా, ప్రధానమంత్రి తన పర్యటనలో ఒక్కమాట కూడా మాట్లాడలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన 11 విశ్వవిద్యాలయాల నిర్మాణం గురించి కూడా ఎలాంటి ప్రస్తావన చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పీజీ విద్యార్థులపై భారంగా మారిన జీవో నంబర్ 77 విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఆ జీవోను రద్దు చేయాల్సిన అవసరం ఉందని నాసర్ గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో AISF కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చకపోవడం వల్ల ఆంధ్ర ప్రజల ఆగ్రహం మరింత పెరుగుతోందని తెలిపారు. మోదీ నాయకత్వంలోని కేంద్రం ఆంధ్ర ప్రజలను తక్కువగా చూస్తోందని వారు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *