కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామ ఉప సర్పంచ్, టిడిపి యువ నాయకుడు జాస్తి వసంత్, జగ్గంపేట నియోజకవర్గం నుంచి అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిధి వరకు పాదయాత్ర చేపట్టారు. జ్యోతుల నెహ్రు ఎమ్మెల్యేగా గెలిస్తే కొండకు వస్తానని మొక్కుకున్నాను అని, గ్రామాభివృద్ధిని కోరుకుంటూ మొక్కులు చెల్లించడానికే ఈ పాదయాత్ర చేస్తున్నానని ఆయన అనుచరులు తెలిపారు.
పాదయాత్ర ప్రత్తిపాడు నియోజకవర్గం లోకి ప్రవేశించగానే ధర్మవరం వద్ద టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. బస్వా వీరబాబు, వెన్నా శివ, భూపాలపట్నం ప్రసాద్, యాళ్ల జగదీశ్, యర్రాబత్తుల గోవింద్ నాయుడు, బొదిరెడ్ల సుబ్బారావు, అంబటి బుజ్జి తదితరులు ఆయనకు సంఘీభావం తెలిపారు.
వన్నెపూడి జంక్షన్ వద్ద, జనసేన నాయకుడు మొయిళ్ల నాగబాబు గెస్ట్ హౌస్ లో ప్రత్తిపాడు మండల టీడీపీ నాయకులు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అక్కడ అభిమానులతో కొంతసేపు ముచ్చటించిన తర్వాత, పాదయాత్ర పునః ప్రారంభించి సాయంత్రానికి అన్నవరం చేరుకొని శ్రీ సత్యదేవుని దర్శించుకోనున్నారు.
ఈ పాదయాత్ర ప్రాంతవ్యాప్తంగా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఉప సర్పంచ్ వసంత్ చేపట్టిన ఈ యాత్ర ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అన్నవరం చేరుకున్న తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకోనున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు.