ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో దుబాయ్‌లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు వికెట్లు తీసి కివీస్‌ను కంగారు కొట్టించాడు. ఈ విజయంతో టీమిండియా లీగ్ దశను ఓటమి లేకుండా ముగించి నాకౌట్‌కు ప్రవేశించింది.
మ్యాచ్ అనంతరం వరుణ్ తన క్రికెట్ ప్రయాణాన్ని పంచుకున్నాడు. 26 ఏళ్ల వరకు తాను క్రికెట్ గురించి సరిగ్గా ఆలోచించలేదని, తానొక ఆర్కిటెక్ట్‌గా పని చేశానని, సినిమాలు చేయాలని కలలు కనేవాడినని చెప్పాడు. కానీ తన మనసు చివరికి క్రికెట్ వైపే మొగ్గుచూపిందని, అదే తన నిజమైన లక్ష్యమని గుర్తించి తీవ్రంగా శ్రమించానని వెల్లడించాడు.
2021 టీ20 ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన ఇచ్చిన అనుభవం తన మదిలో మెదులుతుందని చెప్పిన వరుణ్, ఆ సమయంలో కోహ్లీ, రోహిత్ శర్మ తనను మానసికంగా ధైర్యం చెప్పి ముందుకు నడిపించారని వెల్లడించాడు. వారి ప్రోత్సాహం వల్లే తాను మరింత ధైర్యంగా బౌలింగ్ చేయగలిగానని తెలిపారు. ఈ మ్యాచ్‌లోనూ వారి మాటలు తనను నెట్టుకువచ్చాయని పేర్కొన్నాడు.
ఇక, న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. రోహిత్ సేన రేపు (4న) ఆస్ట్రేలియాతో తలపడనుంది. వరుణ్ చక్రవర్తి తన ప్రదర్శనను కొనసాగిస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టు విజయం సాధిస్తే ఫైనల్‌కు అడుగు పెట్టనుంది.