ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే ప్రాణాలకు ప్రమాదం తప్పదని తిరుపతి పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నగరంలోని ప్రధాన రహదారులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ చారి, రూరల్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వ్యతిరేక మార్గంలో ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులను పట్టుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై అధిక జరిమానాలు విధించడంతో పాటు వారికి కఠిన హెచ్చరికలు ఇచ్చారు.
ఈ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనాలను తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొన్ని ద్విచక్ర వాహనాల నంబర్ ప్లేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలు నివారించగలమని అధికారులు సూచించారు. రాంగ్ రూట్‌లో ప్రయాణించే అలవాటు ఉన్న వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను గౌరవించి, సురక్షితంగా ప్రయాణించాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.