విప్‌కు దిక్కులేని ప్రసన్న, బుచ్చి కౌన్సిలర్లు టిడిపిలో

Prasanna's hopes shattered in Buchireddypalem vice-chairman election. YSRCP councillors defect, town convener Mallareddy joins TDP. Prasanna's hopes shattered in Buchireddypalem vice-chairman election. YSRCP councillors defect, town convener Mallareddy joins TDP.

బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయతి వైస్ చైర్మన్ ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి కఠినపరీక్ష ఎదురైంది. వైసిపి కౌన్సిలర్లు విప్‌ను పట్టించుకోకుండా టిడిపి వైపు అడుగులు వేయడంతో ఆయన ఆశలు భగ్నమయ్యాయి. పట్టణ కన్వీనర్ టంగుటూరు మల్లారెడ్డి, 10వ వార్డు కౌన్సిలర్ టీవీ మల్లారెడ్డి టిడిపిలో చేరడం కౌన్సిలర్ల వలసలను మరింత ఊపందించింది.

ఎన్నికల ముందు వరకూ ప్రసన్న తన అభ్యర్థిని గెలిపించుకుంటానని ధీమాగా ఉన్నా, కౌన్సిలర్ల వైసిపిని వీడి టిడిపిలో చేరడం ఆయనకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. సీనియర్ నాయకుడు ఇప్పగుంట మల్లారెడ్డి నేతృత్వంలో పలువురు కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. టిడిపి నేతల టచ్‌లో ఉన్న మరో ముగ్గురు కౌన్సిలర్లు కూడా త్వరలో పార్టీ మారనున్నట్టు సమాచారం.

ప్రసన్న కుమార్ రెడ్డి నియంతృత్వ ధోరణి, స్థానిక నేతలతో విభేదాలు కారణంగా కౌన్సిలర్లు అతన్ని వీడి వెళ్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసిపి శిబిరంలో నిరాశ నెలకొనగా, బుచ్చిరెడ్డి పాళెం అభివృద్ధి కోసం టిడిపిని ఎన్నుకున్నామని కొత్తగా చేరిన నేతలు ప్రకటించారు.

వైసిపి నుంచి వలసలు కొనసాగితే, బుచ్చిరెడ్డి పాళెం పంచాయతిలో టిడిపికి ఆధిక్యత పెరిగే అవకాశముంది. వైస్ చైర్మన్ ఎన్నికకు ముందు ఈ పరిణామాలు వైసిపికి గట్టి ఎదురుదెబ్బగా మారాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నాయకత్వాన్ని నమ్మి టిడిపిలో చేరిన కౌన్సిలర్లు, పట్టణ అభివృద్ధికి తోడ్పడతామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *