ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్‌లో నాగచైతన్య సందడి

Actor Naga Chaitanya visited Khairatabad RTO for his driving license renewal. Fans gathered to see him. His upcoming film 'Thandel' releases on Feb 7. Actor Naga Chaitanya visited Khairatabad RTO for his driving license renewal. Fans gathered to see him. His upcoming film 'Thandel' releases on Feb 7.

టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రిన్యూవల్ కోసం ఆయ‌న ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లడం జరిగింది. అక్కడ ఆయన ఆర్టీఏ జాయింట్ కమిషనర్ రమేశ్‌ను కలిశారు. అనంతరం రవాణా శాఖ అధికారులు చైతూ డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేశారు.

నాగచైతన్య ఆర్టీఓ కార్యాలయానికి వచ్చిన వార్త తెలిసిన అభిమానులు ఆయనను చూడటానికి పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆయన్ను చూసేందుకు ఎగబడ్డ అభిమానులకు ఆయన అభివాదం చేస్తూ, కొన్ని క్షణాలు వారితో గడిపారు.

చైతూ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ‘తండేల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది రొమాంటిక్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా, చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తున్నారు.

‘తండేల్’ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం చైతన్య కెరీర్‌లో మరో విశేషమైన చిత్రంగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *