హైదరాబాద్లోని పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో మూడు రోజులపాటు జరుగుతున్న 33వ నేషనల్ కాంగ్రస్ ఆఫ్ వెటర్నరీ పరసిటాలజీ రెండవ రోజు శాస్త్రీయ సమావేశాలు నిర్వహించబడ్డాయి. పశు వైద్య కళాశాల పరిధిలో ఈ సదస్సు నిర్వహించబడుతోంది.
ఈరోజు అడవి జంతువులు, పౌల్ట్రీ మరియు పశువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధుల నియంత్రణ పై పలు అంశాలపై చర్చ జరిగింది. పరాన్నజీవుల కారణంగా వ్యాపించే వ్యాధుల నిర్ధారణ మరియు నియంత్రణకు ఆధునిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు.
పరాన్నజీవుల నివారణకు బయోలాజికల్ నియంత్రణ మరియు రసాయనిక మందులకు ప్రత్యామ్నాయ చికిత్సల పై ప్రత్యేక ప్రదర్శనలు చేయబడ్డాయి. ఈ ప్రదర్శనల్లో కొత్త చికిత్సలు, ఔషధ సమీకరణలు పై పతకాలతో పాటు పలు పరిశోధనల ఫలితాలు వివరించబడ్డాయి.
వివిధ రంగాలకు చెందిన పరిశోధకులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొని పరాన్నజీవుల నియంత్రణకు సంబంధించిన తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ కాంగ్రస్ ద్వారా శాస్త్రీయ చర్చలకు, నూతన ఆవిష్కరణలకు మేళవింపు కుదిరింది.