Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadవెటర్నరీ పరసిటాలజీ కాంగ్రస్‌ లో శాస్త్రీయ సదస్సులు

వెటర్నరీ పరసిటాలజీ కాంగ్రస్‌ లో శాస్త్రీయ సదస్సులు

-

Chat on WhatsApp

హైదరాబాద్‌లోని పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో మూడు రోజులపాటు జరుగుతున్న 33వ నేషనల్ కాంగ్రస్ ఆఫ్ వెటర్నరీ పరసిటాలజీ రెండవ రోజు శాస్త్రీయ సమావేశాలు నిర్వహించబడ్డాయి. పశు వైద్య కళాశాల పరిధిలో ఈ సదస్సు నిర్వహించబడుతోంది.

ఈరోజు అడవి జంతువులు, పౌల్ట్రీ మరియు పశువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధుల నియంత్రణ పై పలు అంశాలపై చర్చ జరిగింది. పరాన్నజీవుల కారణంగా వ్యాపించే వ్యాధుల నిర్ధారణ మరియు నియంత్రణకు ఆధునిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు.

పరాన్నజీవుల నివారణకు బయోలాజికల్ నియంత్రణ మరియు రసాయనిక మందులకు ప్రత్యామ్నాయ చికిత్సల పై ప్రత్యేక ప్రదర్శనలు చేయబడ్డాయి. ఈ ప్రదర్శనల్లో కొత్త చికిత్సలు, ఔషధ సమీకరణలు పై పతకాలతో పాటు పలు పరిశోధనల ఫలితాలు వివరించబడ్డాయి.

వివిధ రంగాలకు చెందిన పరిశోధకులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొని పరాన్నజీవుల నియంత్రణకు సంబంధించిన తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ కాంగ్రస్ ద్వారా శాస్త్రీయ చర్చలకు, నూతన ఆవిష్కరణలకు మేళవింపు కుదిరింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp