కోరుకున్న కోరికలు తీర్చే గణనాథుడు వరసిద్ధి వినాయకుడని ఆ గ్రామస్తుల నానుడి, వివరాల్లోకి వెళ్ళితే నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా తానూరు మండలం బోసి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని గత 64 సంవత్సరాలుగా కర్ర వినాయక విగ్రహం వరసిద్ధి వినాయకుని ప్రతిష్టాపించేసి పూజలు చేస్తున్నారు. గ్రామంలో వరసిద్ధి వినాయకుని అండదండలతో దాదాపు ఇంటికో ఉద్యోగం, పాడిపంటలతో ప్రతి ఇల్లు సౌభాగ్యలతో నెలకొని ఉందని అక్కడి పండితులు వాపోతున్నారు. 11 రోజులు పూజలు అందుకున్న తరువాత వరసిద్ధి వినాయకున్ని గ్రామంలోని భావి వద్ద నీళ్లు చిలకరించి,తీసుకువచ్చి భద్రపరుస్తారు.ఇలా ప్రతి సంవత్సరం పూర్తిగా నిమజ్జనం చేయకుండా నీళ్లు చిలకరించి భద్రపరిచి ఉంచడం ఇక్కడి వినాయకుని విశిష్టత. స్థానికులే కాకుండా చుట్టుపక్కల మండలాలు,జిల్లాలు వేరే రాష్ట్రాలలో నుంచి సైతం జనాలు ఇక్కడి వినాయకుని వచ్చి పూజించి, మొక్కలు సమర్పించుకుంటారు. సంతానం లేనివారు ఇక్కడ మొక్కలు తీర్చుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తులను నమ్మకం.
64 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న వరసిద్ధి వినాయకుడు
