స్వచ్ఛత హి సేవా ర్యాలీ… జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపు…

స్వచ్ఛత హి సేవా కార్యక్రమం భాగంగా, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి నాయకత్వంలో స్వచ్ఛతా హి సేవ ర్యాలీ నిర్వహించబడింది. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. స్వచ్ఛత హి సేవా కార్యక్రమం భాగంగా, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి నాయకత్వంలో స్వచ్ఛతా హి సేవ ర్యాలీ నిర్వహించబడింది. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది.

స్వచ్ఛత హి సేవా కార్యక్రమం లో భాగంగా, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపు ఇచ్చారు.

బుధవారం, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక వై జంక్షన్ నుండి నందంగనిరాజు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించబడింది.

జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా, కలెక్టర్ పి.ప్రశాంతి స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ర్యాలీని ప్రారంభించామని తెలిపారు.

సమాజం పరిశుభ్రంగా ఉంటే అభివృద్ధి మరియు ఆరోగ్యం సాధ్యమవుతుందని చెప్పారు.

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు లక్ష్యాలను నేరవేర్చడానికి సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజలు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *