ప్రతి ఏడాది తెలుగు సినీ అభిమానులు ఎదురుచూసే ప్రత్యేక సమయం సంక్రాంతి సినిమాల పోటీ. పెద్దెత్తున విడుదలయ్యే సినిమాలతో థియేటర్లలో పండుగ వాతావరణమే కనిపిస్తుంది.ఈసారి కూడా అదే తరహాలో మూడు పెద్ద చిత్రాలు సంక్రాంతి బరిలోకి దిగనున్నాయి.మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఓ భారీ మాస్ ఎంటర్టైనర్మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్యు వ నటుడు నవీన్ పొలిశెట్టి వినూత్న కథతో తెరకెక్కిస్తున్న కామెడీ మూవీఈ మూడు సినిమాలు ఒకే టైంలో విడుదల అవ్వడం గతేడాది త్రిముఖ పోటీని గుర్తుచేస్తోంది. అప్పట్లో కూడా మూడు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడగా, ప్రేక్షకుల నుండి మంచి స్పందనలే వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే హంగామా మళ్ళీ రిపీట్ కానుంది. మెగా అభిమానులు, మాస్ ఆడియెన్స్, యువత మధ్య విభిన్న రుచులకు తగిన సినిమాలు థియేటర్లను శోభాయమానంగా మార్చబోతున్నాయి.ఈ సంక్రాంతికి గట్టిగ ప్రొమోషన్లు, పాటలు, ట్రైలర్లతో హైప్ పెంచుతున్న ఈ చిత్రాలు, బాక్సాఫీస్ వద్ద ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
“సంక్రాంతి బరిలో మళ్లీ మూడు సినిమాలు – చిరు, రవితేజ, నవీన్ పొలిశెట్టి తలపడి”
ఈసారి సంక్రాంతికి త్రిముఖ పోటీ... పండుగ బరిలో మరో స్టార్ హీరో
