మెదక్ జిల్లా నిజాంపేట మండలం నుంచి నస్కల్-నందగోకుల-రాంపూర్ వెళ్లే రహదారి అధ్వాన్నంగా మారడంతో మహిళా సంఘాలు రోడ్డు పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే చొరవ చూపాలని కోరుతున్నాయి. రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరమని, పిల్లలు, వృద్ధులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరవ రోజుకు చేరుకున్నాయి.
