రిషి వ్యాలి స్కూల్ లో 2003 నుండి 2004 వరకు ఏడాది పాటు ఉపాధ్యాయు ర్యాలీగా విధులు నిర్వహణ….
ఆ అనుబంధం ఏనాటిదో.. ఆ తరువాత కొన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె వద్ద ఉన్న రిషివ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలకు పాఠాలు బోధించారు.
భోపాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఆమ్ అద్మీ పార్టీతో, ప్రశాంతభూషణోనూ పరిచయం ఏర్పడింది.
ఆతిశి 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
ఆమె అప్పటి దిల్లీ విద్యాశాఖ మంత్రి మనిష్ సిసోడియాకు 2015 నుంచి 2018 వరకు సలహాదారుగా పనిచేశారు.
ఆమ్ అద్మీ పార్టీ వెబ్ సైట్లో తెలిపిన సమాచారం మేరకు ఆమె సిసోడియా సలహాదారుగా పనిచేయడంతో పాటు డిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషించారు.
స్కూల్ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకుండా కఠిన నిబంధనలు విధించారు.
ఆతిశి ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు కూడా.
ప్రస్తుతం ఆతిశి చేతిలో డిల్లీ విద్యాశాఖతో పాటు ఉన్నత విద్య, టెక్నికల్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్, పబ్లిక్ వర్క్స్ తదితరాల పగ్గాలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించ నున్నారు..
