రష్యాలో మిస్సింగ్‌గా మారిన భారతీయ విద్యార్థి కేసు విషాదాంతమైంది. ఉఫా నగరంలో నది ఒడ్డున భారత విద్యార్థి అజిత్ సింగ్ చౌదరి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఈ విషయం రష్యాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. విద్యార్థి మరణ వార్తతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
అజిత్ సింగ్ చౌదరి (22) రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా లక్ష్మణ్‌గఢ్‌కు చెందినవాడు. 2023లో ఎంబీబీఎస్ చదివేందుకు రష్యాలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేరాడు.
అక్టోబర్ 19న ఉదయం పాలు కొనడానికి వెళ్తున్నట్లు హాస్టల్లో చెప్పి బయటకు వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన స్నేహితులు, యూనివర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ప్రారంభించారు. 19 రోజుల తర్వాత ఉఫా నగరంలోని నది ఒడ్డున అజిత్ సింగ్ మృతదేహం లభించింది. అక్కడే అతని బట్టలు, మొబైల్ ఫోన్, బూట్లు కూడా దొరికాయి.
Also Read:ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడు: డొనాల్డ్ ట్రంప్
విద్యార్థి మృతిపై భారత రాయబార కార్యాలయం అధికారికంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.
కాంగ్రెస్ నేత జితేందర్ సింగ్ అల్వార్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను విద్యార్థి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సహాయం చేయాలని కోరారు.
ఆయన మరణంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, బష్కిర్ యూనివర్సిటీ ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
Also Read:ప్రపంచకప్ విజేత క్రికెటర్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్‌లో ఘన స్వాగతం
