‘రఘు తాత’ కథ 1960లలో సాగే ఒక యువతి కయల్ (కీర్తి సురేశ్) చుట్టూ తిరుగుతుంది. ఆమె ఆధునిక ఆలోచనలు, భాషాభిమానంతో స్త్రీ సమానత్వాన్ని పోరాడుతుంది.
తాత రఘు ఉత్తమన్ ఆమె అభిప్రాయాలకు విలువనిచ్చే వ్యక్తి. కయల్ పెళ్లి విషయంలో తల్లిదండ్రులకు ఎదురుచూపులు ఉంటాయి.
కయల్ కి సెల్వన్ అనే యువకుడు పరిచయం అవుతాడు. అతనితో పెళ్లి చేసుకోవాలని కయల్ నిర్ణయించుకున్నప్పటికీ, అతని నిజ స్వభావం గురించి ఆమెకు అనుమానం వస్తుంది.
సెల్వన్ నిజ స్వభావాన్ని తెలుసుకున్న తర్వాత, అతని భావాలు, నియంత్రణపరమైన లక్ష్యాలు కయల్ కి తెలియజేస్తాయి.
కథలో ప్రధానంగా స్త్రీల అభ్యుదయ భావాలు, సమానత్వం, భాషాభిమానం వంటి అంశాలను టచ్ చేస్తుంది. కానీ ఈ అంశాలు ప్రభావవంతంగా ప్రేక్షకులకు చేరవేయలేకపోయాయి.
‘రఘు తాత’ అనే టైటిల్ నేపథ్యంలో తాత-మనవరాలి బంధం మీద ప్రత్యేకమైన భావోద్వేగాలు ఉంటాయని అనుకున్నా, అవి అంతగా కనపడవు.
సినిమా చాలా నెమ్మదిగా, సీరియస్ గా సాగుతుంది. కీలక సన్నివేశాలు కూడా కచ్చితమైన కనెక్ట్ ఇవ్వలేకపోయాయి.
వినోదం లేకుండా కథను ముందుకు తీసుకెళ్లడం, నెమ్మదిగా నడిచే కథనంతో ప్రేక్షకులకు ఒక డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ ను కలిగిస్తుంది.